అప్పట్లో కేంద్రీయ విద్యాలయం కడతామంటే పది ఎకరాలు ఇచ్చేసి నాలుగు ఎకరాలు మా గ్రామానికి ఉంచుకుంటామని తెలిపాం. కానీ కేంద్రీయ విద్యాలయం కట్టకుండా అది ఎక్కడికో మార్పు చేసి ఇప్పుడు మొత్తం కూడా కబ్జా చేయడానికి పాల్పడుతున్నారని.. వీటిని మేము సహించమని కొండూరు శరత్ కుమార్ తెలిపారు. రాజంపేట మున్సిపాలిటీని చూస్తే మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఇట్టే అర్థమవుతుంది. రాజంపేటలో ఎక్కడ చెత్త అక్కడే, ఎక్కడ మురికి అక్కడే ఉంది. ముందు దాని సంగతి చూడండి. కుక్కలకు, పందులకు నిలయంగా మారిన రాజంపేట మున్సిపాలిటీ, రోడ్లపై ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్యలు.. కొద్దిపాటి వర్షానికి రోడ్లంతా డ్రైనేజీతో జలమయం అయిపోతాయి వాటిని అభివృద్ధి చేయండి. మున్సిపాలిటీ ప్రజల క్షేమాన్ని ముందు చూడండి. అత్యవసరంగా శిల్పారామం కట్టాల్చినంత అవసరం లేదు. అంత అవసరం అని భావిస్తే రాజంపేట మున్సిపాలిటీ స్థలాలు చాలా ఉన్నాయి అక్కడ కట్టుకోండి. మా గ్రామ పంచాయతీలోని స్థలం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం మాత్రమే ఈ స్థలాన్ని ఉపయోగించుకుంటాం. గ్రామపంచాయతీ సర్పంచ్ రెజల్యూషన్ లేకుండా పంచాయతీ స్థలం శిల్పారామం కు ఎలా కేటాయిస్తారు? ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీటీసీల వరకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం. మా పంచాయతీ స్థలాన్ని మేమే ఆక్రమించి గ్రామపంచాయతీ డెవలప్మెంట్ కు ఉపయోగిస్తాం. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు..
తెర వెనుక రాజకీయాలు చేస్తే ఒప్పుకోం..
70
previous post