అన్నమయ్య జిల్లా, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి గ్రామాలలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కు రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ రెండు గ్రామాల క్రికెట్ జట్లు కెప్టెన్లకు ఒక్కొక్కరికి రూ 10 వేలు చొప్పున రూ 20 వేలు క్రికెట్ కిట్టు కొనుగోలు కోసం చెక్కు అందజేశారు. యువత శక్తివంతంగా ఎదగాలి, యువతతోనే దేశంలో మార్పు సాధ్యం అని ఆయన వెల్లడించారు. యువత క్రీడారంగం, రాజకీయ రంగమే కాక అన్ని రంగాలలోనూ రాణించి శక్తివంతంగా ఎదిగి దేశ అభ్యున్నతి కోసం పాటుపడాలని అన్నారు. వీరబల్లి మండలానికి చెందిన ఈడిగ పల్లె, వడ్డిపల్లె గ్రామాల యువకుల కోరిక మేరకు క్రికెట్ కిట్టు కొనుగోలు కోసం చెక్కు అందజేశారు.
అనంతరం జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలు, చదువు పట్ల మక్కువ పెంచుకొని, ప్రతి దినము వ్యాయామం చేస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా, సౌష్టవంగా ఉంచుకోవాలని సూచించారు. యువత మంచిగా ఉంటే దేశం బాగుపడుతుందని ఆయన తెలిపారు.
ఎన్నికల వేళ నేతలు వెదజల్లే డబ్బులు కోసం ఆశ పడకుండా, మీ భవిష్యత్తు బాగుండాలి అంటే వచ్చిన నాయకులను, అధికారులను రోడ్లు, పారిశుద్ధ్యం, మంచినీటి వసతి వంటి అభివృద్ధి పనుల కోసం అధికారులను, నేతలను నిలదీయాలని అన్నారు. గ్రామ గ్రామాన ఇందుకోసం యువత నడుం బిగించాలని, అప్పుడే దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందని తెలిపారు. రానున్న ఎన్నికలలో టిడిపి, జనసేన కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన చేనేత వికాస రాష్ట్ర కార్యదర్శి రాటాల రామయ్య, శ్రీనివాసులు, చౌడయ్య, కొత్తూరు వీరయ్య ఆచారి,కత్తి సుబ్బరాయుడు, పోలిశెట్టి రజిత, శిరీష, వీరబల్లి మండలం వడ్డీ పల్లె క్రికెట్ జట్టు కెప్టెన్ బాలచంద్ర, ఈడిగపల్లె జట్టు కెప్టెన్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.