ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్‌జీపీటీ ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఓ సంచలనం ఓపెన్ ఏఐతోపాటు గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమకంటూ సొంత చాట్ బోట్‌లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోని అతిపెద్ద భారతీయ కంపెనీలలో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ ఏఐ ఆధారిత వ్యవస్థలోకి అడుగుపెట్టింది. అందుకోసం ఐఐటీ-బాంబే తో కలిసి ‘భారత్ జీపీటీ’ డెవలప్‌మెంట్ పై పని చేస్తున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. ముంబైలో జరిగిన ‘టెక్ ఫెస్ట్’లో ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ జీపీటీ ఏమిటంటే. దీన్ని రిలయన్స్ జియో ఐఐటీ బాంబే సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. చాట్ జీపీటీ తరహాలో భారత్ జీపీటీ కూడా కృత్రిమ మేధ ఆధారిత సమాచార వ్యవస్థ. ఈ భారత్ జీపీటీని “జియో 2.0” అని కూడా పిలుస్తున్నారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఒక విస్తృత సమాచార వ్యవస్థను రూపొందించడం భారత్ జీపీటీ లక్ష్యం. కంపెనీ డెవలప్ మెంట్ కోసం ఒక వ్యవస్థ రూపకల్పన చాలా ముఖ్యమని జియో 2.0పై ఇప్పటికే పనులు ప్రారంభించామని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. వచ్చే దశాబ్దిని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జెనరేటివ్ ఏఐ నిర్వచిస్తాయని తెలిపారు. మీడియా స్పేస్, కామర్స్, కమ్యూనికేషన్ల రంగంలోనూ ఉత్పత్తులు, సర్వీసులను ఆవిష్కరిస్తామన్నారు. రిలయన్‌తో ఐఐటీ బాంబే 2014 నుంచి వివిధ కార్యక్రమాల రూపకల్పనల్లో భాగస్వామిగా ఉంది. కృత్రిమ మేధ విస్తృత సామర్థ్యం సహకారంతో సృజనాత్మకత, వైవిధ్య పూరిత ఉత్పత్తులు, సేవలను అందించడం లక్ష్యంగా ఈ రెండు కలిసి పని చేస్తున్నాయి. ఇంజనీరింగ్ విభాగం రిలయన్స్ జియో సహకారంతో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ , ఐఐటీ బాంబేలోని కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, GPT సొల్యూషన్స్‌పై అన్ని రంగాల కోసం భారతదేశ స్వంత భారత్ జీపీటీని అభివృద్ధి చేయడానికి పరిశోధనలు చేస్తోంది.
చాట్‌జీపీటీకి పోటీగా.. జియో భారత్ జీపీటీ రెడీ
84
previous post