వైకాపా నుంచి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ సీఎం జగన్‌కు 11 పేజీల లేఖ రాశారు. అందులోని అంశాలు పార్టీవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఏడాదిన్నరగా మిమ్మల్ని కలవాలని ప్రయత్నిస్తున్నా అవకాశం ఇవ్వలేదు. మీరు అత్యంత అభిమానించే టాప్-5 నాయకుల్లో ఉన్నానన్నారు. సీఎంగా ఉన్నంతవరకు నాపై ఎర్రబల్బు వెలిగిస్తానన్నారు. మంత్రి పదవి ఇస్తారనుకుంటే, ఇప్పుడు రాజకీయ జీవితానికే ఎర్రబల్బు పడింది. వైకాపాలో చేరాలని ఆహ్వానం వచ్చినప్పుడు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్నా చేరాను. విశాఖలో పార్టీ బలోపేతానికి ఆది నుంచి కష్టపడి పనిచేస్తే కనీసం మనిషిలా గుర్తించలేదు. వివిధ పార్టీల నుంచి నాయకులను చేర్పించడం, ధర్నాలు, బంద్‌లు, అర్ధరాత్రి రోడ్లపై పడుకుని నిద్రలేని రాత్రులు గడిపాను. ఇప్పుడు ఇంత చిన్నచూపు చూస్తారని, ఇన్ని ఇబ్బందులు పెడతారని అనుకోలేదు. మీరు జైల్లో ఉండి పార్టీ కష్టంలో ఉన్నప్పుడు అండగా ఉంటే, అధికారంలోకి వచ్చాక నమ్మకద్రోహం చేసి, ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టి ఘోరంగా అవమానించారు. మీరు విశాఖ వచ్చినప్పుడల్లా మా ఇంటికి వస్తే అన్నగా భావించాం. అలాంటి కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు’’ అని వంశీకృష్ణ పేర్కొన్నారు.
జగన్‌కు వంశీకృష్ణ యాదవ్ సంచలన లేఖ
110
previous post