నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని శిఖరం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ అధికారులు ఏపీఎస్ఆర్టీసీ బస్సును నిలుపుదల చేశారు. గురువారం రోజు రాత్రి ఎనిమిది గంటల 35 నిమిషాల సమయంలో సుమారు 40 మంది ప్రయాణికులతో శ్రీశైలం నుంచి విజయవాడకు బయలుదేరిన విజయవాడ డిపోకు చెందిన AP 10 Z 0737 నెంబర్ గల సూపర్ లగ్జరీ బస్సు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు చెక్ పోస్ట్ సిబ్బంది నిలిపివేశారు. అకస్మాత్తుగా దట్టమైన అడవి ప్రాంతంలో గల శిఖరం చెక్పోస్ట్ వద్ద బస్సు నిలిపివేయడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దట్టమైన అడవి ప్రాంతం కావడంతో చలి గాలులతో భక్తులు, చంటి పిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి సమయంలో 9:00 దాటితే శిఖరం చెక్పోస్ట్ నుంచి ఏ ఒక్క వాహనాన్ని కూడా అనుమతించరని అనుమతించాల్సి వస్తే స్థానిక శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ అధికారి వారి అనుమతి అవసరమని చెక్పోస్ట్ సిబ్బంది తెలిపారు. స్థానిక మీడియా ఘటన స్థలానికి చేరుకోవడంతో అప్పటివరకు బస్సును అనుమతించని ఫారెస్ట్ సిబ్బంది చివరకు బస్సు వెళ్లేందుకు 10:10 నిముషాలకు శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనుమతి ఇచ్చినట్లుగా వెల్లడించి అక్కడ నుంచి బస్సు విజయవాడ వెళ్లేందుకు అనుమతించారు.
చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ అధికారుల ఓవర్ యాక్షన్..
64
previous post