ములుగు జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేర లేఖ విడుదల చేశారు. ప్రజాస్వామిక తెలంగాణ పునర్నిర్మాణానికై ఉద్యమించాలని, తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని, UAPA కేసులను రద్దు చేసి NIA దాడులను ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ సమాజం కావాలని సీపీఐ (మావోయిస్టు)పై, అనుబంధ ప్రజాసంఘాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయండని “ప్రజా పాలన” కార్యక్రమంలో- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని జగన్ పిలుపునిచ్చారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రమంటూ ప్రకటించిందని, పదేళ్లు తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. వనరులను కొల్లగొట్టిన తెలంగాణ గత పాలకులు దొర తనాన్ని పునర్నిర్మించి వ్యవసాయ కూలీల, పేదరైతుల, మధ్యతరగతి, ఉద్యోగ కార్మిక వర్గాలను కకలావికలం చేశారు. కాళేశ్వరం దోపిడీ, మిషన్ భగీరథ పైపుల ద్వారా అవినీతి, మేడిగడ్డ ప్రాజెక్టులో కోట్లాది రూపాయల ప్రజాధన దుర్వినియోగం ఇలా అంతటా ప్రజలను వంచించారని ఆయన విమర్శించారు. కేసీఆర్ కు అన్ని వేల కోట్ల ఆస్తు లెక్కడివి? హరీశ్ రావు ఏ శ్రమతో వేల కోట్ల ఆసామి అయ్యాడు? కేటీఆర్, కవిత సంతోష్ రావుల ఆర్థిక స్థితిగతులపై వాస్తవాలు ఏంటి? కాళేశ్వరం ద్వారా మెగా కృష్ణారెడ్డి మీద కుటుంబం పొందిన పర్సెంటేజీల వివరాలను బయటపెట్టాలన్నారు. అహంకారంతో ప్రజా ఆస్తులను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించాలన్నారు.
66
previous post