బాపట్ల మండలం లో రైతుల పరిస్థితి అగమ్మ్య గోచరంగా ఉంది. బాపట్ల మండలంలోని కంకట పాలెం మురుకొండపాడు గ్రామాలలో జూన్, జూలైలో వదలాల్సిన సాగునీరు కాలువల రిపేర్ వలన సెప్టెంబర్, అక్టోబర్లో సాగునీరు విడుదల చేశారని దానివలన రైతులు వరి నారుమళ్లు ఆలస్యముగా పోసి సాగునీరు లేటు అవ్వటం వల్ల లేటుగా వరి నాట్లు ప్రారంభించారు. ఇప్పుడు వరి పైరు ఈత దశలో ఉన్నందువల్ల వరి పైరుకు నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఈ తరుణంలో రైతులు పంట పొలాల వద్దకు వచ్చి బిక్క మొఖం వేస్తున్నారు. గత నెల రోజులుగా వరి పైరుకు నీరు లేక అల్లాడిపోతున్నామని రైతులు వాపోతున్నారు. మిగ్జాం తుఫాన్ నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు రైతులకు కొంత ఊరటనిచ్చిన ఆ పిదప కాలువలకు గండ్లు పడి అప్పటినుండి ప్రభుత్వం వరి పైరకు నీరు ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. ముందు చూపులేని ఈ గుడ్డి ప్రభుత్వం మిచాంగ్ తుఫాన్లో బాపట్ల, గుంటూరు, కృష్ణాజిల్లాలో భారీ వర్షాలు కురిసిన ఇరిగేషన్ అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్దన్న గేట్లు మొత్తం ఎత్తి నీరును సముద్రంలోకి వృధాగా వదిలి వేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే ముందు చూపుతో ఇరిగేషన్ అధికారులు బ్యారేజ్ వద్ద కొంత నీరును నిలిపి రైతులకు నీరు ఇచ్చి ఉంటే ఈరోజు మేము ఈ విధంగా నష్టపోయే వాళ్ళం కాదని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు సాగు నీరు విడుదల చేస్తే కొద్దిపాటి పెట్టుబడులతోనైనా బయటపడతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూస్తామని రైతులు అంటున్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల గోడు పట్టదా అని ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నీళ్ల పరిస్థితి ఇలా ఉంటే మురుకుంటపాడు పొలాలకు వెళ్లే దారి పరిస్థితి చాలా దయానీయంగా ఉందని రైతులు అంటున్నారు. మేము సంవత్సర కాలం పాటు ఇదే రోడ్డులో ప్రయాణం చేయాలని వర్షం కురిస్తే ఈ రోడ్డు చిత్తడి చిత్తడిగా మారి చాలా ఇబ్బందిగా ఉంటుందని రైతులు వాపోతున్నారు. ఈ మురుకొండపాడు రోడ్డులో 5 వేల ఎకరాలకు రైతులు, రైతు కూలీలు ప్రయాణిస్తుంటారని పొలంకు వెళ్లి వస్తే మా నడుములు గుల్లవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రోడ్డు ప్రారంభోత్సవం చేసినప్పటికీ 2019 ఎలక్షన్లు వచ్చి ఈ రోడ్డు పనులు ఆగిపోయినాయి. అప్పటినుండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక తట్ట మట్టి కూడా వేసిన దాఖలలు లేవని రైతులు వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేసి రోడ్డుపై ప్రయాణించడానికి వీలుగా రైతులకు, రైతు కూలీలకు ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వ అధికారులను రైతులు వేడుకుంటున్నారు.
Read Also..