ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైయస్సార్సీపి రెండవసారి నియోజకవర్గాల ఇన్చార్జిల పేర్లను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా యువతకు ప్రాధాన్యత ఇస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థిగా తుడా చైర్మన్ మోహిత్ రెడ్డిని ప్రకటించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రస్తుత ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి ఇప్పటికే గడపగడపకు మన కార్యక్రమం లో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. 2019 ఎన్నికల తర్వాత నుంచి కూడా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజలకు కావలసిన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని, కరోనా సమయంలో అయితే ఒక అడుగు ముందుకు వేసి ప్రతి ఇంటిని ఆదుకున్నామని మోహిత్ రెడ్డి అన్నారు. ఈసారి చంద్రగిరి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని కచ్చితంగా వైసీపీ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేసారు.
ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు..
74
previous post