98
మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎవరికి ఏం చేశారని కదిలిరావాలని ఎద్దేవా చేశారు. ఎంతసేపు సీఎం జగన్ ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఎంతమందికి ఉద్యోగం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిందేమి లేదని, ఇప్పుడు అధికారం ఇస్తే ఏదో చేస్తారని మాట్లాడుతున్నారని, వారి మాటలని ప్రజలు నమ్మే పరిస్ధతిలో లేరన్నారు.