ఏటిగట్టు పనులు చేస్తుండగానే గట్టు కుప్ప కూలడం తో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో 2022 నవంబరు లో గోదావరి కి వచ్చిన వరదలకు పొన్నపల్లి వద్ద ఏటీగట్టు కోతకు గురైనది. ఆ సమయంలో రూ.56 లక్షలు తో తాత్కాలికంగా పనులు చేసి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. అనంతరం శాశ్వత పనులు చేపట్టేందుకు రూ.26.3 కోట్లు తో పనులు చేపట్టారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పనులు జరుగుతున్న గట్టు కుప్ప కూలింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతాన్ని జనసేన నియోజకవర్గ ఇన్చార్జీ బొమ్మిడి నాయకర్, టీడీపీ నాయకులు కొవ్వలి రామ మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తదితరులు పరిశీలించారు. పనుల నాణ్యత లోపంతో నే ఏటి గట్టు కుప్ప కూలిందని ఆరోపించారు.
పనులు చేస్తుండగా కుప్పకూలిన ఏటిగట్టు…
63
previous post