59
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చల్లపల్లి మండలం వక్కలగడ్డలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికారుల తీరు రైతులను అవమానపరిచేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొన్న వెంటనే సొమ్ము చెల్లించాలని, బాధ్యత సక్రమంగా నిర్వహించని అధికారులను, సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు రోడ్డుపై రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోవటంతో చల్లపల్లి సీఐ నాగప్రసాద్, చల్లపల్లి, ఘంటసాల, ఎస్ఐలు చినబాబు, శ్రీనివాసు వక్కలగడ్డ చేరుకుని రైతులతో మాట్లాడి రాస్తారోకో విరమింప చేశారు. సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో చర్చించారు.