84
కాకినాడ జిల్లా జగ్గంపేట కిర్లంపూడి మండలం రాజుపాలెంలో దళిత యువకులు రోడ్లను నిర్బంధించారు. రాజుపాలెం వీరవరం రోడ్డు విషయంలో 20 రోజుల క్రితం R&B, దళిత యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నాయి. R&B ఈఈ వెంకటేశ్వర ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు FIR నమోదు చేశారు. అయితే తమను కులం పేరుతో దూషించాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా.. కేసు నమోదు చేయలేదంటూ దళిత యువకులు ఆరోపణలు చేశారు. సామర్లకోట కిర్లంపూడి రోడ్డును నిర్బంధించి యువకులు తమ నిరసన తెలియజేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి జగ్గంపేట సిఐ లక్ష్మణరావు, కిర్లంపూడి ఎస్సై ఉమామహేశ్వరరావు చేరుకున్నారు.