ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆనవాళ్లు కనిపించడం లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు జగన్ తూట్లు పొడిచారని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి పాలనకు, జగన్ పాలనకు పొంతనే లేదన్నారు. నాన్న పేరును జగన్ పూర్తిగా చెడగొట్టాడని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశాడని అన్నారు. తనకు వ్యక్తిగతంగా నష్టం చేసినా ప్రజలకు మేలు చేస్తాడని భరించానని అయినా అలా జరగలేదన్నారు. జగన్ ఒక నియంత మాదిరి పెద్దపెద్ద కోటలు కట్టుకున్నారని షర్మిల విమర్శించారు. ఎమ్మెల్యేలకు కూడా ఆయన కనిపించరన్నారు. ఎంతో మంది కష్టపడి, త్యాగాలు చేస్తేనే జగన్ సీఎం అయ్యాడని చెప్పారు. పక్కన ఉన్న అందరినీ దూరం చేసుకుంటున్నాడని అన్నారు. వైఎస్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. జగన్ కోసం రాజీనామా చేసిన 18 మందిలో ఎంత మందిని మంత్రులను చేశాడని షర్మిల ప్రశ్నించారు.
Read Also..
Read Also..