76
అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో దారుణం చోటుచేసుకుంది. అనంతపురం పట్టణ శివారులో ఉన్న సంసిద్ ఇంటర్నేషనల్ పాఠశాలలో విజయ శంకర్ అనే వార్డెన్ విద్యార్థులను చితకబాదాడు. విద్యార్థుల మర్మాంగాలపై దాడి చేసి గాయపరిచాడు. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు వార్డెన్ గదిని తనిఖీ చేయగా.. గుట్టలు గుట్టలుగా మద్యం సీసాలు, పొగాకు ఉత్పత్తులు, గంజాయి లాంటి మత్తు పదార్థాలు బయట పడ్డాయి. వెంటనే చర్యలు తీసుకుంటామని డీఈవో మాట మార్చారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.