86
తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించారు. పాలకమండలి సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి 2024-25 వార్షిక బడ్జెట్ ను బోర్డులో ప్రవేశపెట్టారు. శ్రీవారి ఆలయ వార్షిక బడ్జెట్ 5వేల కోట్ల ను దాటేసింది. 15సంవత్సరాల క్రితం వేయి కోట్లు ఉన్న బడ్జెట్ ఇప్పుడు 5వేల కోట్లు దాటడం రోజురోజుకు స్వామివారికి వచ్చే ఆదాయాన్ని సూచిస్తుంది. గత కరోనా సమయంలో ఆదాయం తగ్గినప్పటికీ గత రెండు సంవత్సరాలుగా పూర్తిస్థాయిలో పెరగడంతో ఈ మార్కును దాటిందని ఛైర్మన్ తెలిపారు.