75
నేటి నుంచి తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానుంది. నిన్నటితో సర్పంచుల పదవీకాలం ముగియనుండటంతో రాష్ట్రంలోని 12 వేల 769 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఆయా మండలాల్లోని ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవో, డీటీ, ఆర్‌ఐ, ఇంజినీర్లు, ఇతర గెజిటెడ్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా ఉన్నతాధికారులు నియమించారు. సర్పంచుల ఆధీనంలో ఉన్న డిజిటల్ కీలు, చెక్కులు, ఇతర రికార్డులన్నంటినీ స్వాధీనం చేసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక అధికారికి, కార్యదర్శికి ప్రభుత్వం జాయింట్ చెక్ పవర్ అవకాశం కల్పించింది.