81
గుంటూరు జిల్లా, తాడేపల్లి రైల్వే స్థలంలో నివాసం ఉంటున్న వారిని నివాస గృహాలు ఖాళీ చేయాలంటూ రైల్వేశాఖ నోటీసులు జారీ చేసింది. రైల్వే కట్ట నివాస ప్రాంత వాసులు తాడేపల్లి పట్టణంలో 40 సంవత్సరాల తరబడి ఉంటున్నారు. సుమారు 600 కుటుంబాలు రైల్వే స్థలంలో నివాసం ఉంటున్నారు. నోటీసులు రావడంలో ఆ కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. విషమం తెలుసుకున్న పలు రాజకీయ పార్టీలు బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామి ఇచ్చారు.