74
ఏపీ మంత్రి రోజాకు తిరుమల కొండపై నిరసన సెగ తగిలింది. ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆమె ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతం నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు ఆమెను చుట్టుముట్టారు. ఆమెతో సెల్ఫీలు దిగుతూనే జై అమరావతి, ఏపీకి ఒకటే రాజధాని, వందేమాతరం అని నినాదాలు చేశారు. జై అమరావతి అని మీరు కూడా చెప్పండి మేడమ్ అని రోజాను వారు అడిగారు. అయితే, రోజా చిరునవ్వులు చిందిస్తూనే శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటి అంటూ అక్కడి నుంచి ముందుకు సాగారు.