దాయాది పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనల మధ్య శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఇప్పటివరకు 250 స్థానాలకు పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఫలితాలు ప్రకటించింది. ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పీటీఐ పార్టీ మద్ధతున్న స్వతంత్రులు అత్యధికంగా 99 సీట్లు గెలుచుకున్నారు. ఇక నవాజ్ షరీఫ్ సారధ్యంలోని పీఎంఎల్-ఎన్ 71 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. పీపీపీ 53 సీట్లు, ఇతరులు 27 స్థానాలు గెలుచుకున్నారు. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. తమ పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ లేదని, ఇతర పార్టీలను కలిసి రావాలని నవాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్ ఎన్నికల్లో తమకే మెజారిటీ దక్కిందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నవాజ్ షరీఫ్ ఒక తెలివితక్కువ రాజకీయ నాయకుడని వ్యాఖ్యానించారు. అయితే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.