ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మూడు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ కు అనుహే స్పందన వచ్చింది. హైదరాబాద్ కు చెందిన చేతన ఫౌండేషన్, కొంగర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సత్తుపల్లి కి చెందిన లైన్స్ క్లబ్ సహకారంతో సత్తుపల్లి జేవియర్ డిగ్రీ కళాశాలలో రెండు రోజులు పాటు జరిగే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ను కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ ప్రారంభించారు. క్యాన్సర్ బారిన పడిన రోగులకు అవగాహన లేక.. చివరి దశకు చేరేవరకు గుర్తించలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, అలాంటి వారికి అవగాహనతో పాటు క్యాన్సర్ కు సంబంధించిన కొన్ని రకాల పరీక్షలు కూడా నిర్వహించి సుమారు 25 వేల రూపాయలు వైద్య ఖర్చులు ఉచితంగా అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. రెండు రోజులు పాటు జరిగే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో మొదటిరోజు 215 మంది ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. Read Also..
క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్..
95
previous post