అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షెక్షానుపల్లి వద్ద ఏ.వి.ఆర్ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు( School Bus)కు పెను ప్రమాదం తప్పింది. జరుట్ల రాంపురం నుండి ఉరవకొండ వైపు వెళ్తున్న బస్సు స్టీరింగ్ రాడు విరిగిపోవడంతో పక్కకు వెళ్లి ఓవైపుకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. మిగతా వారంతా క్షేమంగా ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. హుటాహుటిన పాఠశాల యాజమాన్యం మరో బస్సును తీసుకువచ్చి విద్యార్థులను పాఠశాలకు తరలించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులందరూ పాఠశాల వద్దకు చేరుకొని పాఠశాల యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ప్రమాదంలో విద్యార్థులకు ఎం కాకపోవడంతో అంత ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికైనా బస్సులు పూర్తిస్థాయిలో పరీక్షించి సరైన బస్సులను ఏర్పాటు చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం మీద విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడ్డారు. Read Also..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.