అనంతపురం జిల్లా గుత్తి మండలం బసీనేపల్లి గ్రామ సమీపంలోని కొండపై వెలసిన శ్రీ గదేరాళ్ల తిమ్మప్ప స్వామి కళ్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకుడు రవి ప్రకాష్ రావు, సుధీంద్రనాథ్ ఆధ్వర్యంలో కన్నుల పండువగా సాగింది. ముందుగా ఆలయంలోని స్వామివారి మూలవిరాట్ కు వేకువజామున సుగంధద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గద్దెరాళ్ళ తిమ్మప్ప స్వామికి కళ్యాణ మహోత్సవం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. శ్రీగద్దెరాళ్ళ తిమ్మప్ప స్వామి నామస్మరణతో ఆలయం మారుమోగింది. ఆలయ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఆలయ ప్రాంగణంలో భక్తాదుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
శ్రీ గదేరాళ్ల తిమ్మప్ప స్వామి కళ్యాణోత్సవం…
107
previous post