తూర్పు గోదావరి (East Godavari):
కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వైసీపీ నాయకులు ముద్దన సూర్య ప్రకాష్, ముద్దన శ్రీనివాస్, ముద్దన సత్యనారాయణ లు వారి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముద్దన సూర్యప్రకాష్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు అవినీతి మితిమిరి పోయిందనీ, ప్రతి చిన్న పనికి గ్రామస్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని, గత 25 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ లో కొనసాగిన 2019 తర్వాత గ్రామానికి చెందిన ఒక నాయకుడు వైసీపీలో రావాలని కోరగా వైసీపీలో చేరానని, తన కన్న ముందు నుండి తన సోదరులు ఇద్దరు వైసీపీలో ఉన్నారని అన్నారు.
Follow us on :Facebook, Instagram& YouTube.
ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా పార్టీ కోసం కష్టపడి పార్టీ విజయం సాధించేలా కృషి చేశామని, తన సోదరుడు ప్రమాదంలో గాయపడితే కనీసం పలకరింపు కూడా చేయకుండా స్థానిక శాసనసభ్యులు ఉన్నారని ఆరోపించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశామని, గ్రామంలో కొందరు నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని కన్నబాబు దృష్టి కి తీసుకువెళ్లిన ఫలితం లేదని అందుకే మనస్తాపంతో పార్టీ కి రాజీనామా చేస్తున్నామని తెలిపారు. త్వరలో తన వర్గం నుండి సుమారు 300 మంది వైసీపీ పార్టీ కి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తారని, రాన్నున ఎన్నికల్లో వైసీపీ కి వ్యతిరేకంగా పని చేయటమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ మీడియా సమావేశం లో కాకి సురేష్, పుల్ల సురేష్, ముద్దన సత్తిబాబు, కొప్పిసెట్టి బాబ్జీ, నక్కా అబ్బులు తదితరులు పాల్గొన్నారు. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.