Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home National కల్కి ధామ్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన

కల్కి ధామ్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన

by Satya
Prime Minister Modi

తాను నెరవేర్చేందుకే కొందరు మంచి పనులను తన కోసం వదిలి వెళ్లారని ప్రధాని నరేంద్ర మోదీ యూపీలో జరిగిన కల్కి ధామ్‌ శంకుస్థాపన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ పరిధిలోని ఐంచోడ కాంబోహ్‌లోని శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయడం తనకు దక్కిన వరమని, ఈ ఆలయం భారతీయుల విశ్వాసానికి మరో కేంద్రంగా అవతరిస్తుందని అ‍న్నారు. ఒకవైపు దేశంలోని యాత్రా స్థలాలను అభివృద్ధి చేస్తూనే, మరోవైపు నగరాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారీ స్థాయిలో నిర్మితం కాబోతున్న ఈ కల్కిధామ్ ఎంతో ప్రత్యేకంగా నిలవనున్నదని, గర్భాలయంలో దశావతారాలు ఉంటాయన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ నేడు భారతదేశ వారసత్వ సంపద ప్రపంచ వేదికపై గుర్తింపు పొందుతున్నదన్నారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన.
    పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్త పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడులు జరగడం, ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగడం శాంతి, భద్రత, స్థిరత్వానికి ముప్పుగా మారుతాయని విదేశాంగ శాఖ పేర్కొంది. అన్ని…
  • భారత దేశం మరో కొత్త రకం గుర్రం జాతి.
    భారత దేశం మరో కొత్త రకం గుర్రం జాతికి వేదిక కాబోతుంది. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రకాల దేశీయ గుర్రాల జాతులను రిజిస్టర్డ్ జాతుల జాబితాలో గుర్తించింది. వీటికి అదనంగా తెల్లటి నుక్రా జాతి గుర్రం భారతదేశపు తొమ్మిదవ రిజిస్టర్డ్…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039396
Total views : 196648

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: