పార్లమెంటు ఎన్నికల దృశ్య వివిధ పార్టీల నుండి చేరికలు చేసుకోవచ్చని అధిష్టానం నుండి పిలుపు రావడంతో ఫిబ్రవరి 16వ తేదీన ఎఐసిసి ఇంచార్జ్ దీపా మున్సీదాస్ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో గత ఎన్నికల్లో మునుగోడు బిజెపి పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి పార్టీ కండువా కప్పుకొని పార్టీ లో చేరడం జరిగిందని సోషల్ మీడియాలో పలు వీడియోలు ఫోటోలు రావడంతో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గం.
అంతటితో ఆగకుండా చలమల కృష్ణారెడ్డి శనివారం రోజు చౌటుప్పల్ మండలం దామేర గ్రామంలో తన క్యాంప్ కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గ పలు మండలాల ముఖ్య నేతలను, కార్యకర్తలను తో ముఖ్య సమావేశం నిర్వహించి తాను రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది రథసప్తమి రోజు మంచి రోజు కావడం తో జాయిన్ అయ్యానని తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానినని, తను బీజేపీ పార్టీలో ఉన్న తన మనసు కాంగ్రెస్ పార్టీ లో వున్నదని, మరో రెండు రోజుల్లో ఐదు వేల మంది కార్యకర్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గాంధీభవన్లో మరోసారి జాయిన్ అయితా అని తెలుపుతూ, స్థానిక ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి పనిచేయడం తనకు ఎటువంటి అభ్యంతరం లేదని పార్టీ ఎవరికి ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేస్తామని తెలపడంతో పాటు పార్టీ ఆదేశిస్తే టికెట్ ఇస్తే ఎంపీగా కూడా ఉంటానని తెలిపారు.
దీనిని ఖండిస్తూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ మరియు యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండం సంజీవరెడ్డి చలమల కృష్ణారెడ్డి చేరిక చెల్లదని తాను మాత్రమే పార్టీలో చేరానని చెప్పుకుంటున్నాడు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీషియల్ గా తెలపలేదని తాను గత ఎన్నికల్లో బిజెపి పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఓటమి కోరుకున్నాడని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తన ఆస్తులు కాపాడుకోవడం కోసమే పార్టీలో చేరుతున్నట్టు చేరానంటూ చెప్పుకుంటున్నాడని దీన్ని ఖండిస్తున్నామని ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలిపారు.
చలమల కృష్ణారెడ్డి చేరికపై ఇప్పటివరకు మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పలు మండలాల సోషల్ మీడియా గ్రూపులలో ఒకరి పై ఒకరు చర్చించుకుంటున్నారు తప్ప రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు చలమల కృష్ణారెడ్డి చేరిక ను ఉద్దేశించి మాట్లాడకపోవడం గమనార్హం. పార్లమెంటు ఎన్నికలు దగ్గర్లోనే ఉండడంతో సగటు కార్యకర్త ఈ గ్రూపు రాజకీయాలు ఏందీ అని మునుగోడు నియోజక వర్గ వ్యాప్తంగా జోరుగా చర్చించుకుంటున్నారు దీనిపై పూర్తి అవగాహన రావాలంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితేనే స్పష్టమైన అవగాహన వస్తుందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.