తన భర్త 15 సంవత్సరాలు పలు రాష్ట్రాల్లో దేశ సేవ చేసి రిటైర్ అయిన తర్వాత వచ్చిన పెన్షన్ డబ్బులతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట గ్రామం 21,23,33 పలు సర్వే నెంబర్ల లో గల గ్రీన్ స్టార్ వెంచర్లు ప్లాట్ కొనుగోలు చేయగా దానిని అందులోనే సహ భాగస్వామి గా ఉన్న అంబికా దర్బార్ బత్తి యజమాని అంబికా ప్రసాద్ పలు ప్లాట్లను కబ్జా చేసి మమ్మల్ని ప్లాట్ల వద్దకు రానియ కుండా చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించుకొని ప్రశ్నించిన మాపై కుక్కలను వదులుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు ఎలాగైనా న్యాయం జరగాలని గ్రీన్ స్టార్ వెంచర్ ఎదురుగా టెంట్ వేసుకొని ధర్నా చేస్తున్న బాధితులు సుమారు 100 ప్లాట్ల వరకు కబ్జా గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితురాలు కుసుమ ఎక్స్ ఆర్మీ భార్య. బాధితుడు సత్యనారాయణ మాట్లాడుతూ నేను 108 వాహన డ్రైవర్ గా పని చేస్తూ రాత్రింబవళ్లు ఒక పూట తిని తినకుండా దాచుకున్న డబ్బులతో గ్రీన్ స్టార్ వెంచర్లు ప్లాట్ కొనుగోలు చేశాను తీరా ఇక్కడికి వచ్చేసరికి మీ ఫ్లాట్లు లేవు కబ్జాయి గురయ్యాయని మమ్మల్ని వేధిస్తున్నారు. మా ప్లాట్లలో పోలీసులు దగ్గర నుండి కాంపౌండ్ వాల్ నిర్మించారు. కొత్త ప్రభుత్వం రావడంతో మాకు కొద్దిగా ఆశలు వచ్చాయి మాకు న్యాయం చేయాలని ఈ రోజు గ్రీన్ స్టార్ వెంచర్ ముందు ధర్నా చేస్తునాం..
nalgonda district news
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయాల్లో కలియదిరుగుతూ నీటి కుక్కలు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. శివాలయం పుష్కర ఘాట్ వద్ద దర్శనమిచ్చాయి కనుమరుగైపోతున్న జాతుల్లో నీటికుక్కలు కూడా ఒకటి అటు భూమి మీద ఇటు నీటిలో ఉండ గలిగే ఉభయ చరాల్లో నీటికుక్కలు కూడా ఒకటి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నీటికుక్కల ఉనికిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇటీవలే తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి కుక్కలు దర్శనమిచ్చాయి చేపల్ని ఆహారంగా తీసుకుని నీటికుక్కలు జీవనం సాగిస్తుంటాయి. రెండేళ్ళ క్రితం ఒకసారి సాగర్ జలాల్లో నీటికుక్కలను గుర్తించారు. అయితే ఆ తరువాత కాలంలో అవి కనిపించకుండా పోయాయి. తాజాగా సాగర్ జలాల్లో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలోనే నీటి కుక్కలు జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వీటి సంతతి పెరుగుతున్నట్లు స్పష్టమౌతుంది అంతరించి పోతున్న అరుదైన జాతి కావటంతో వీటిని సంరక్షించాలని పర్యాటకులు, జంతు ప్రేమికులు కోరుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం 113 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిలో కబ్జాలు చేసి అక్రమ నిర్మాణం చేసిన కట్టడాలను ఆర్టీవో శేఖర్ రెడ్డి సూచనల మేరకు టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది పాల్గొన్న రెవిన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది. 113 సర్వే నెంబర్లో కబ్జాకు గురి అయిన సుమారు 36 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్న రెవిన్యూ సిబ్బంది. తెల్లవారుజాము నుంచి సర్వే నంబర్ 113 ప్రభుత్వ భూమి లో నిర్మించిన అక్రమ కట్టడాలపై ప్రహరీ గోడను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది.
పార్లమెంటు ఎన్నికల దృశ్య వివిధ పార్టీల నుండి చేరికలు చేసుకోవచ్చని అధిష్టానం నుండి పిలుపు రావడంతో ఫిబ్రవరి 16వ తేదీన ఎఐసిసి ఇంచార్జ్ దీపా మున్సీదాస్ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో గత ఎన్నికల్లో మునుగోడు బిజెపి పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి పార్టీ కండువా కప్పుకొని పార్టీ లో చేరడం జరిగిందని సోషల్ మీడియాలో పలు వీడియోలు ఫోటోలు రావడంతో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గం.
అంతటితో ఆగకుండా చలమల కృష్ణారెడ్డి శనివారం రోజు చౌటుప్పల్ మండలం దామేర గ్రామంలో తన క్యాంప్ కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గ పలు మండలాల ముఖ్య నేతలను, కార్యకర్తలను తో ముఖ్య సమావేశం నిర్వహించి తాను రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది రథసప్తమి రోజు మంచి రోజు కావడం తో జాయిన్ అయ్యానని తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానినని, తను బీజేపీ పార్టీలో ఉన్న తన మనసు కాంగ్రెస్ పార్టీ లో వున్నదని, మరో రెండు రోజుల్లో ఐదు వేల మంది కార్యకర్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గాంధీభవన్లో మరోసారి జాయిన్ అయితా అని తెలుపుతూ, స్థానిక ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి పనిచేయడం తనకు ఎటువంటి అభ్యంతరం లేదని పార్టీ ఎవరికి ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేస్తామని తెలపడంతో పాటు పార్టీ ఆదేశిస్తే టికెట్ ఇస్తే ఎంపీగా కూడా ఉంటానని తెలిపారు.
దీనిని ఖండిస్తూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ మరియు యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండం సంజీవరెడ్డి చలమల కృష్ణారెడ్డి చేరిక చెల్లదని తాను మాత్రమే పార్టీలో చేరానని చెప్పుకుంటున్నాడు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీషియల్ గా తెలపలేదని తాను గత ఎన్నికల్లో బిజెపి పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఓటమి కోరుకున్నాడని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తన ఆస్తులు కాపాడుకోవడం కోసమే పార్టీలో చేరుతున్నట్టు చేరానంటూ చెప్పుకుంటున్నాడని దీన్ని ఖండిస్తున్నామని ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలిపారు.
చలమల కృష్ణారెడ్డి చేరికపై ఇప్పటివరకు మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పలు మండలాల సోషల్ మీడియా గ్రూపులలో ఒకరి పై ఒకరు చర్చించుకుంటున్నారు తప్ప రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు చలమల కృష్ణారెడ్డి చేరిక ను ఉద్దేశించి మాట్లాడకపోవడం గమనార్హం. పార్లమెంటు ఎన్నికలు దగ్గర్లోనే ఉండడంతో సగటు కార్యకర్త ఈ గ్రూపు రాజకీయాలు ఏందీ అని మునుగోడు నియోజక వర్గ వ్యాప్తంగా జోరుగా చర్చించుకుంటున్నారు దీనిపై పూర్తి అవగాహన రావాలంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితేనే స్పష్టమైన అవగాహన వస్తుందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
భువనగిరి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇటీవల మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ క్రిష్ణయ్యలపై 31 మంది అవిశ్వాస తీర్మానం కోరారు. అయితే ఆర్డీవో అమరేందర్ ఆధ్వర్యంలో అవిశ్వాసంపై భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఓటింగ్ జరుపగా అనుకూలంగా 31మంది కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్తో సహా మొత్తం 36 మంది ఉండగా.. 31 మంది ఆమోదం తెలిపినట్లు ఆర్డీవో అమరేందర్ పేర్కొన్నారు. అయితే ఆమోదం తెలిపిన 31 మంది కౌన్సిలర్లలో 16 మంది టిఆర్ఎస్ తొమ్మిది మంది కాంగ్రెస్ ఆరు మంది బిజెపి కౌన్సిలర్లు ఉన్నారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్ తో సహా మిగతా ఐదుగురు మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు ఆబోతుల కిరణ్ కుమార్, చెన్న స్వాతి మహేష్, ఏనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్య అవిశ్వాస ప్రక్రియకు గైర్హాజరయ్యారు. అయితే ఆమోదం తెలిపిన నివేదికను జిల్లా కలెక్టర్కు పంపిస్తున్నామని తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ఆర్డిఓ అమరేందర్ మీడియా ముందు వెల్లడించారు.
సంక్రాంతి పండుగ అంటే ఆంధ్ర రాష్ట్రంలో విశిష్టమైన, ఘనంగా జరుపుకునే పండుగ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజ్ వేరే, ప్రతి ఇంటా భోగ భాగ్యాలు కలగాలని రైతుల పంటలు చేతికి వచ్చి ఇంట సిరులు కురావలని నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ కౌన్సిలర్ జడల పుల్లమ్మ చిన్న మల్లయ్య ఆధ్వర్యంలో తెల్లవారుజామున రంగు రంగుల రంగవల్లులు వేసి, పాత వస్తువులతో భోగి మంటలు వేసి, తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా గంగిరెద్దుల ఆట కోలాహలంగా, పూజలు నిర్వహించి భోగి మంటలు కాల్చడం జరిగింది. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో చిట్యాల పట్టణంలోని సంతోష్ నగర్లో భోగి మంటలు కాల్చమని కాంగ్రెస్ కౌన్సిలర్ పుల్లమ్మ చిన్న మల్లయ్య అన్నారు. కాలనీలో గంగిరెద్దుల ఆటలు కాలనీ వాసులకు ఆకట్టుకుంది, ఆడపడుచులు ఇంటి ముందు తీరొక్క రంగులతో రంగవల్లులు వేయడంతో అందరినీ ఆకట్టుకున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గల నాగులకుంట సుందరికరణ పనుల్లో భాగంగా కుంట పై కబ్జా చేసిన డబ్బాలను మున్సిపల్ అధికారులు, సిబ్బంది తొలగిస్తుండగా చిరు వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. చిరు వ్యాపారి భోధుల బిక్షపతి మాట్లాడుతూ సుమారు 20 సంవత్సరాల నుండి ఇక్కడే డబ్బాలు వేసుకొని జీవనాధారం పొందుతున్నాము. కానీ మాకు ఏటువంటి సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ సిబ్బంది మా డబ్బాలు తీస్తున్నారని ఉన్నట్టుండి రోడ్డున పడుతున్నాము. గత సంవత్సరం షార్ట్ సర్క్యూట్ తో సుమారు 25 లక్షల వరకు నష్టం వాటిల్లింది దళిత బందిస్తామన్నారు గాని మాకు ఏ బంధు ఇవ్వలేదు, నాగులకుంట పై గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది కబ్జాలు చేసి గృహ నిర్మాణాలు నిర్మించుకున్నారు. మాతోపాటు వారికి కూడా నోటీసులు ఇచ్చి కూల్చాలని కోరుతున్నాము. మాకు చిరు వ్యాపారం చేసుకునెలా మున్సిపల్ అధికారులు, చైర్మన్ స్థలం చూపించాలని కోరుతున్నామన్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి ఐటీ అధికారులు ఆరు బృందాలుగా విడిపోయి దాడులు చేస్తున్నారు. 5 రైస్ మిల్లులు, ఓ గోదాంలో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ దాడులకు గల కారణం ఆదాయ పన్నుల చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడం. ధాన్యం నిల్వల రికార్డులు, బ్యాంకు ఖాతాల లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. గత నెలలో మూడు రోజుల పాటు జరిగిన ఐటీ దాడులను అధికారులు చేపట్టారు. వరస ఐటీ అధికారుల విస్తృత తనిఖీలతో బెంబేలెత్తుతున్న రైస్ మిల్లర్లు.
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ,ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో రివ్యూ సమావేశం జరిగింది . ఈ సమావేశానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఖమ్మం జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జై వీర్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి, మందుల శామ్యూల్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, కుంభం అనిల్, బాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ” ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులు ఆపకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న డిండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెళ్ళాంల, ఎస్ యల్ బి సి టన్నెల్, నక్కల గండి రిజర్వార్ల పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అలాగే పిలాయిపల్లి కెనాల్, ధర్మ రెడ్డి కెనాల్ పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టు లను పూర్తి చేయడానికి తగినంత బడ్జెట్ ను కేటాయించాలని ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు సుఖేందర్ రెడ్డి సూచించారు. జిల్లా మంత్రులు ప్రాజెక్టులను సందర్శించి, పనులు త్వరగా అయ్యేలా చూడాలని ఆయన కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ఎంత వరకు పూర్తి అయ్యాయి, ఇంకా ఎంత శాతం పనులు పెండింగ్ లో ఉన్నాయి, ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ఎంత నిధులను ఖర్చు చేసింది, అలాగే ఇంకా ఎంత నిధులు అవసరం ఉన్నాయి అనే పూర్తి నివేదికను గుత్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఇరిగేషన్ అధికారులకు అందించారు. ప్రాజెక్టులు పూర్తి అయితే జిల్లాలో నీటి సమస్య ఉండదని, త్వరగా పనులు పూర్తి అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.
దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తి మృతి చెందాడు. చింతపల్లి ఎస్సై కొట్టడం వలనే చనిపోయాడని వెంటనే ఆ ఎస్సైను సస్పెండ్ చేయాలని బంధువులు దేవరకొండ ఆసుపత్రి ముందు నిరసన చేయడంతో ఆసుపత్రి గేటుకు తాళం వేసి లోపలికి ఎవ్వరినీ రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు… అందుబాటులో లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్న చింతపల్లి ఎస్సై మరియు సీఐ లు. వివరాల్లోకి వెళ్తే… దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గ్రామ పంచాయతీ పాలెం తాండలకు చెందిన నేనావత్ సూర్య నాయక్(60) అన్నదమ్ములు భూవివాదంలో ఆదివారం స్థానిక చింతపల్లి పోలీస్ స్టేషన్ లో సూర్య నాయక్ తమ్ముడు నేనావత్ భీమా నాయక్, సూర్య నాయక్ పై పిర్యాదు చేయగా, చింతపల్లి ఎస్సై సతీష్ రెడ్డి సూర్య నాయక్ ను స్టేషన్ కు పిలిపించి విచక్షణరహితంగా పోలీస్ స్టేషన్ లో కొట్టడంతో స్పృహ తప్పి పడిపోవడంతో పోలీస్ సిబ్బంది, అతని కుటుంబ సభ్యులు కలిసి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలిస్తున్న మార్గ మధ్యలోనే అతను మృతి చెందడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది. అయితే సూర్య బంధువులు దేవరకొండ ఆసుపత్రి నుండి మృత దేహాన్ని తరలించి చింతపల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తామని తెలియజేయడంతో మృతదేహాన్ని తరలించకుండా పోలీసులు అడ్డుకొని ఆసుపత్రి గేటుకు తాళాలు వేసి వారిని బయటకు వెళ్లకుండా నిర్భందించారని కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది…




Total views : 54895