ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చి ప్రభుత్వంలోకి తీసుకొచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు ఆధ్వర్యంలో రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టి స్వీట్లు పంచుకొని ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ మునుగోడు ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఆపదలో ఉన్నా అంటే నేనున్నా అని సాయం చేసే వ్యక్తి అటువంటి వ్యక్తికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే నియోజకవర్గానికి అభివృద్ధికి దోహదపడతాడని ఇప్పుడు జరుగుతున్నా సీఎల్పీ మీటింగ్ లో రాజ గోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారు.
nalgonda district news
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 25వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడులో రోడ్ షో, ఈనెల 28న నియోజకవర్గంలో మందకృష్ణ మాదిగ భారీ బహిరంగ సభ ఉంటుందని బిజెపి అభ్యర్థి చల్లమల్ల కృష్ణారెడ్డి తెలిపారు. అమిత్ షా.. రోడ్ షో లో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మునుగోడులో నిర్వహించిన మీడియా సమావేశంలో చల్లమల్ల కృష్ణారెడ్డితో పాటు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, కన్వీనర్ దూడల బిక్షం పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో ప్రచారం పూర్తయిందని, కేవలం మున్సిపాలిటీల్లో మాత్రమే ప్రచారం మిగిలి ఉందని చల్లమల్ల అన్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా… ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని… ఈసారి మునుగోడు గడ్డపై కచ్చితంగా కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని చల్లమల్ల కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో కర్ణాటక రాష్ట్రం కోలార్ నియోజకవర్గం ఎమ్మెల్యే మంజునాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో ప్రచారం నిర్వహించగా కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే మంజునాథ్ మాట్లాడుతూ.. మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డికి ప్రజలు జన నీరాజనం పలుకుతూ కాంగ్రెస్ అంటేనే బిఎల్ఆర్, బిఎల్ఆర్ అంటే కాంగ్రెస్ అనే విధంగా ప్రజల నుండి వస్తున్న స్పందన చూస్తుంటే కచ్చితంగా గెలుస్తామని ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మిర్యాలగూడలో కాంగ్రెస్ జెండా ఎగర వెయ్యాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు అంటూ బిఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో ఏం సాధించిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకి ఇచ్చిన హామీలను నెరవేర్చిందని తెలంగాణలో ఆరు పథకాలను ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే అమలు చేస్తుందని అన్నారు.
Read Also…
Read Also…
ఈ ప్రాంత బిడ్డ గా నాకు ఒక్కసారి అవకాశమిస్తే ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాననన్నారు బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణా రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి, తాస్కాన్ గూడెం, శిరిదేపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. కోలాటాలతో ఘన స్వాగతం పలికారు మహిళలు బిజెపి శ్రేణులు. ఈ సందర్భంగా చలమల్ల కృష్ణా రెడ్డి మాట్లాడుతూ. రాజగోపాల్ రెడ్డి లాగా నేను కాంట్రాక్ట్ ల కోసం రాజకీయాలు చేయడం లేదన్నారు, ఎమ్మెల్యేగా ,ఎమ్మెల్సీగా ఉండి. ఈ ప్రాంతానికి ఆయన చేసిన అభివృద్ధిని ఏమి లేదనీ, ఆయన్ని గెలిపిస్తే మళ్ళీ మనకు దొరకడని అన్నారు. కూసుకుంట్ల ఒక అసమర్ధ ఎమ్మెల్యే అని, ఆయనకు మాట్లాడే ధైర్యం లేదని, ఆయన సేవలిక చాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీని ప్రజలు విస్మరించారని ఈ నెల జరిగే 30న ఎన్నికల్లో బిజెపి పార్టీ 20,000 మెజార్టీతో కషాయం జండా ఎగర పోతుందన్నారు. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా ఈ ప్రాంత అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రతి గ్రామంలో బీటీ రోడ్లు, పేద ప్రజలకు రేషన్ కార్డ్స్, పెన్షన్స్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు, ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేదకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇప్పిస్తామన్నారు. మునుగోడు గడ్డమీద కాషాయం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ఉల్సాయిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని బంగారిగడ్డ తాండాలో కొండముచ్చు హల్ చల్ చేస్తుంది.. ఎక్కడినుండి వచ్చిందో తెలియని కొండముచ్చు దాడులతో తండావాసులు వణికి పోతున్నారు. గత రెండు రోజుల క్రితం పాఠశాలకు వెళ్తున్న మూడవ తరగతి విద్యార్థి రమవత్ నాగచైతన్య పై కొండముచ్చు దాడి చేసి తీవ్రంగా గాయపరచింది.. గతంలో కూడా పలువురు గ్రామస్తులపై విద్యార్థులపై కొండముచ్చు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచినట్లు స్థానికులు చెబుతున్నారు. పిల్లలు పెద్దలు బయట తిరగాలంటే భయంగా ఉందని ఎప్పుడు ఎక్కడ నుండి వచ్చి దాడి చేస్తుందో తెలియడం లేదని తండా వాసులు వాపోతున్నారు.. తమ సమస్యను ఎన్నిసార్లు విన్నవించిన పట్టునట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫారెస్ట్ అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఎన్నికలకు కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మునుగోడు నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డికి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో చలమల్ల కృష్ణారెడ్డికి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి… గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చలమల్ల కృష్ణా రెడ్డి మాట్లాడుతూ… స్థానికుడినైన తనను గెలిపించాలని కోరారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని, కాంగ్రెస్ అహంకార అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉండి మునుగోడు నియోజకవర్గాన్ని ఉద్ధరించింది ఏమీ లేదని విమర్శించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా ప్రభాకర్ రెడ్డి తన సొంతంగా నిధులు తెచ్చిన దాఖలాలు లేవని కృష్ణారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీకి వెళ్లి నిద్రపోవడానికి తప్ప నియోజకవర్గ సమస్యలపై పోరాడింది ఏమీ లేదన్నారు. ప్రజలు తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మునుగోడును సమగ్రంగా అభివృద్ధి చేస్తానని చలమల్ల కృష్ణా రెడ్డి కోరారు.





Total views : 54943