ఎన్టీఆర్ జిల్లా (NTR District), ఇబ్రహీంపట్నం
కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించిన మాజీ మంత్రి దేవినేని ఉమా(Devineni Uma). ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ..
57 నెలలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలు రాజధాని ఫైల్స్(Rajadhani files) సినిమా ద్వారా బట్టబయలు అయ్యాయి. ఒక మూర్ఖుడి అహంకారం ఒక దుర్మార్గుడి అవినీతి అరాచక పరిపాలన వల్ల ఈ రాష్ట్రం అంధకారంలోకి నెట్టి వేయబడింది. నిన్న ఆంధ్రజ్యోతి విలేఖరి శ్రీకృష్ణ మీద అరకిలో మీటర్ వరకు కొట్టుకుంటూ వైసీపీ గుండాలు మంత్రులు, శాసనసభ్యులు అనుచరులు దాడి చేశారు. మళ్లీ ఈరోజు కర్నూలులో ఈనాడు ప్రాంతీయ కార్యాలయం పై మూకుమ్మడి దాడి. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని అనుచరులు పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యం మీద దాడి.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఫోర్త్ ఎస్టేట్ (press and news media) మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేపిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ? పోలీసు యంత్రాంగం పనిచేస్తుందా ? డీజీపీ, ఎస్పీ, ఐజి లా అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నారు ? ఇంటిలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏమయ్యాయి? ప్రజల్లో జరిగేది తెలియకూడదని పత్రికల మీద దాడి చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న. మూడు రాజధానులు అని చెప్పి మన పిల్లల ఈ ప్రాంత భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేసాడో రవిశంకర్ ఒక సాహసోపేతమైన సినిమా తీశాడు. ఉభయ రాష్ట్రాల్లో ఖండాంతరాల్లో ఉన్న తెలుగువారు ఈ సినిమా చూసి మీ గొంతుక ఒక రాజధాని ఫైల్స్ సినిమా గొంతు కై ప్రతి ఒక్కళ్ళు మీ రాష్ట్రాలకు మండలాలకు రండి. తెలుగు జాతిని ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందాం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకుందాము. ఇక్కడ పవిత్ర సంగమం చంద్రబాబు నాయుడు గారు ఎంత పవిత్రంగా పెట్టారో ఇప్పుడు ఈ దుర్మార్గుడు అపవిత్రం చేసి బీరు సీసాలతో అసాంఘిక శక్తులకు అడ్డగా మార్చాడు. ఈ వైసీపీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి తరిమి కొడతారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.