83
మేడారం దోపిడీ (hotel prices in Medaram)…
ఎక్కడైనా పండుగలు, జాతర సమయాల్లో హోటల్స్ యజమానుల ఆశకు అంతే ఉండదు. ప్రస్తుతం ఆసియా లోనే అతి పెద్ద గిరిజన జాతర గా పేరు పొందింది సమ్మక్క సారక్క జాతరలో కూడా హోటల్స్ లో తినుబండారాలు కొండెక్కి కూర్చున్నాయి. సమ్మక్క – సారాలమ్మ జాతరకు మేడారం వస్తున్న భక్తులను నిండా ముంచుతున్నారు హోటల్స్ యజమానులు. రెండు మూడు రోజులు నిల్వ ఉంచిన పిండితో వంటలు చేస్తున్నారు. అంతేగాక అపరిశుబ్రంగా హోటల్స్ దర్శనమిస్తున్నాయి. లక్షలాది మంది వచ్చే భక్తులతో మేడారంలో ఆకాశమే హద్దుగా హోటల్స్ యజమానులు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. రేట్లు ఇంత భారీగా దర్శనమిస్తున్న… చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం మౌనం వహించడంపై భక్తులు మండిపడుతున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.