పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రంలోని టీఎస్ ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో బుధవారం మంథని ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మేడారం జాతరకు వెళ్తున్న భక్తులకు ఉచిత అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలో ముఖ్య అతిథులుగా మంథని రెవెన్యూ డివిజన్ అధికారి హనుమా నాయక్ హాజరై, అన్నదాన శిబిరానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇదే క్రమంలో మంథని ఎంపిపి కొండా శంకర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని, జాతరకు వెళ్ళే భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ తెలియజేశారు. అలాగే మంథని ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం నాయకులు మాట్లాడుతూ.. దానం చేసే అవకాశం ఉంటే ఆర్య వైశ్యులు ముందుంటారని అన్నారు. పిలిచిన వెంటనే కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు, మంథని ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.