తెలంగాణ కుంభమేళా, మేడారం జాతరను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. సీఎంకు మంత్రి సీతక్క, అధికారులు స్వాగతం పలికారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవార్లకు రేవంత్ రెడ్డి నిలివెత్తు బంగారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్న అనంతరం ఆరు గ్యారెంటీల అమలు పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 27న రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేస్తామని చెప్పారు. పథకం అమలు కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వస్తారని తెలిపారు. గతంలో కేసీఆర్ దర్శించుకోలేదు కాబట్టే ఓడిపోయారని అన్నారు. జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వస్తే ఈ పండుగను జాతీయ పండుగగా మార్చమని కేంద్రాన్ని కోరామని కానీ అందుకు కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. దక్షిణాది కుంభమేళాకు కేంద్రం ఇచ్చేది రూ. 3 కోట్ల రూపాయలేనా అని ప్రశ్నించారు. ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్న ఇక్కడి నుంచే మొదలు పెట్టామని రేవంత్ రెడ్డి చెప్పారు. హాత్ సే హాత్ జోడో యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించామని అన్నారు. సమక్క సారక్క దీవెనలతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. యాత్ర సమయంలో ఎలాంటి ఆకంటం లేకుండా జాతర జర్పిస్తామని మాట ఇచ్చామని మాట ప్రకారం జాతర కోసం రూ. 110 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
medaram jathara
మేడారం జాతర (Medaram Jathara):
మేడారంలో వనదేవతల మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. చుట్టుపక్కల రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే జాతర లో సుమారు కోటిన్నర మంది భక్తులు సమ్మక్క- సారలమ్మ ల దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు రోజులపాటు కిక్కిరిసిపోయే మేడారం జాతరలో పోలీసు వ్యవస్థే చాలా కీలకంగా వ్యవహారిస్తుంది.
సమ్మక్క- సారలమ్మ తల్లులను గద్దెలకు చేర్చడం నుంచి ప్రముఖులకు బందోబస్తు ఇవ్వడం, మేడారం తరలి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేయడం, జాతరలో రష్ ను కంట్రోల్ చేయడం, ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడటం, దొంగతనాల నియంత్రణ ఇలా ప్రతి ఒక్క పనీ పోలీసుల పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మేడారం మహాజాతరలో పోలీసు బలగాలే కీలకంగా పని చేస్తాయి. మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో పోలీస్ ఫోర్స్ నేటి నుంచి రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టమని స్పష్టం చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మేడారం అంటేనే పోలీసులకు సవాల్ గా మారే జాతర గా చెప్తుంటారు. జాతరలో ఏం కొంచెం నిర్లక్ష్యం వహించినా.. తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిచోటా పోలీస్ నిఘా ఉండేలా ఈసారి పెద్ద మొత్తంలో పోలీసులు మోహరిస్తున్నారు. జాతర పూర్తయ్యే వరకు 14 వేల మందితో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఐజీ డా.తరుణ్ జోషి మేడారం మహాజాతర బందోబస్తు, నిఘాపై దృష్టి పెట్టారు. గతంలో మేడారం ట్రాఫిక్ ఇంచార్జి గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన జాతరపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. జాతర మొత్తం మీద ఐజీ, డీఐజీలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 20 మంది ఎస్పీలు, 42 మంది ఏఎస్పీలు, 140 డీఎస్పీలు, 400 సీఐలు, వెయ్యి మంది ఎస్సైలు, దాదాపు 12 వేల మంది కానిస్టేబుళ్లకు జాతర విధులు కేటాయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోసుకోకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ములుగు జిల్లా ఎస్పీ తెలిపారు.
నేటి నుంచి 24వ తేదీ వరకు మేడారం మహా జాతర వైభవంగా జరుగుతుంది. ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు కోటిన్నర మంది భక్తులు తల్లుల దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతా భారీ ఎత్తున తరలివచ్చే భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం కత్తిమీద సాము లాంటి పని… జాతర సమయంలో చిన్నాచితకా దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భద్రతా పరమైన చర్యలతో పాటు జాతర క్రౌడ్ కంట్రోల్ కు పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాతర పరిసరాల్లో మొత్తంగా 500 కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు,కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి మేడారం జాతరను పర్యవేక్షణ చేస్తున్నాం అని ములుగు ఎస్పీ శబరీష్ చెబుతున్నారు.
సమ్మక్క-సారలమ్మ లను దర్శించుకోవడానికి ఈసారి ప్రముఖుల ఎక్కువ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి 23 న జాతరకు వస్తున్నారు.. ఈ నేపథ్యంలో అధికారులు ఫోకస్ పెట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క మేడారం జాతర సక్సెస్ పై దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని అందరూ మంత్రులు మేడారం వచ్చే అవకాశం ఉంది. వీఐపీల తో పాటు సాధారణ భక్తుల దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రంలోని టీఎస్ ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో బుధవారం మంథని ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మేడారం జాతరకు వెళ్తున్న భక్తులకు ఉచిత అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలో ముఖ్య అతిథులుగా మంథని రెవెన్యూ డివిజన్ అధికారి హనుమా నాయక్ హాజరై, అన్నదాన శిబిరానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇదే క్రమంలో మంథని ఎంపిపి కొండా శంకర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని, జాతరకు వెళ్ళే భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ తెలియజేశారు. అలాగే మంథని ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం నాయకులు మాట్లాడుతూ.. దానం చేసే అవకాశం ఉంటే ఆర్య వైశ్యులు ముందుంటారని అన్నారు. పిలిచిన వెంటనే కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు, మంథని ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. Read Also..
- తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ నియామకం ..by CVR NEWSతెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ బాధ్యతలు స్వీకరించడం పోలీస్ వ్యవస్థలో కీలక మార్పులకు దారితీయనుంది. హైదరాబాద్లో జన్మించిన ఆనంద్ చిన్నప్పటి నుంచే ప్రతిభను చాటుకుని విద్యలో అగ్రగామిగా నిలిచారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువు కున్న సి వి ఆనంద్…
- మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందనby CVR NEWSదేశానికి అన్నం పెట్టే అన్నదాత.. ఇప్పుడు అడుగడుగునా దగా పడుతున్నాడు. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ప్రార్థించిన ఆ కళ్లు.. ఇప్పుడు గిరిజన సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వైపు దీనంగా చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో అన్నదాతల పరిస్థితి…
- వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.by CVR NEWSరాష్ట్రంలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా అధికారులకు, విత్తన కంపెనీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Medaram Jathara News:
తెలంగాణ కుంభమేళగా పిలువబడే మేడారం సమ్మక్క సారక్క జాతర(Medaram Jathara)ను పురస్కరించుకొని కేంద్రం జాతరకు వెళ్లే భక్తుల సౌకార్యార్ధం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ఈ రోజు కాగజ్ నగర్ నుంచి ప్రారంభమైంది. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు వెళ్లేందుకు గాను ఈ నెల 21 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఈ రైలు నడవనున్నట్టు రైల్వే అదికారులు తెలిపారు. మొదటి రోజు ప్రత్యేక రైలు ఏర్పాటు చెయ్యడంతో మేడారం జాతరకు వెళ్లే భక్తులతో కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ కిటకిటలాడింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.
దేశంలో అత్యధిక భక్తులు సందర్శించే జాతర మేడారం. అయితే వచ్చే నెలలో జరగబోయే మేడారం జాతర నిర్వహణకు, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక శ్రధ్ద చూపుతోంది. వచ్చే నెలలో జరగబోయే మేడారం మహా జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖకు సూచించింది. మేడారం సమ్మక్క సారక్క జాతరపై హైదరాబాద్లోని ఎంసీహెచ్ ఆర్డీలో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లను విడుదల చేసిందన్నారు. ఈ జాతరలో గిరిజన, ఆదివాసీ సంప్రదాయ నృత్యలతో పాటు ఇతర రాష్ట్రాల కళాకారుల బృందాలతో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతరలో మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ దఫా జాతర ప్రాంతాన్ని 10 జోన్లుగా వర్గీకరించాలన్నారు. భక్తులు.. వన దేవతలను ప్రశాంతంగా దర్శించుకుని తిరిగి అంతే ప్రశాంతంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Read Also..
ములుగు జిల్లా, మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరను జయప్రదం చేస్తామని సీతక్క అన్నారు , ఫిబ్రవరి 21 నుండి జాతర ప్రారంభం అవుతుంది. ఇప్పటికే 75 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర సైతం మేడారం దేవతల సన్నిధి నుండే ప్రారంభించారు. అడగ్గానే నిధులు కేటాయించారు. అవసరమైన మేరకు మరిన్ని నిధులు ప్రభుత్వాన్ని కోరుతాం. మా ఇంటి ఇలవేల్పు మేడారం తల్లులు. అధికారులకు అన్ని సూచనలు చేశాం. జాతర విజయవంతం కోసం ప్రణాళిక రూపొందించాం. కాంట్రాక్ట్ పనులను అవినీతి లేకుండా పూర్తి చేస్తాం. శాశ్వత ప్రాతిపదికన చేస్తాం. కేంద్రానికి కొన్ని పనులకోసం ప్రతిపాదనలు పంపాము. మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రిక్వెస్ట్ పంపుతున్నాము. అందరూ సహకరించి జాతరను విజయవంతం చేయాలి అని ఆమె కోరారు.




Total views : 61692