Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Latest News జాతరకు వెళ్తున్న భక్తులకు ఉచిత అన్నదాన వితరణ..

జాతరకు వెళ్తున్న భక్తులకు ఉచిత అన్నదాన వితరణ..

by Rama
Food Distribution

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రంలోని టీఎస్ ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో బుధవారం మంథని ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మేడారం జాతరకు వెళ్తున్న భక్తులకు ఉచిత అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలో ముఖ్య అతిథులుగా మంథని రెవెన్యూ డివిజన్ అధికారి హనుమా నాయక్ హాజరై, అన్నదాన శిబిరానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇదే క్రమంలో మంథని ఎంపిపి కొండా శంకర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని, జాతరకు వెళ్ళే భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ తెలియజేశారు. అలాగే మంథని ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం నాయకులు మాట్లాడుతూ.. దానం చేసే అవకాశం ఉంటే ఆర్య వైశ్యులు ముందుంటారని అన్నారు. పిలిచిన వెంటనే కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు, మంథని ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. Read Also..

  • ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..
    ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, గాంధీ పార్క్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే…
  • రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి .
    విద్యపై తాము పెట్టేది ఖర్చు కాదన… పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారాయన. ఆరుట్ల గ్రామం ఇప్పుడు రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు.…
  • ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం.
    జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఇంజనీర్ల బృందం పరిశీలించి, మూడు రాష్ట్రాల అధికారులతో కీలక సమీక్ష నిర్వహించింది.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

025719
Total views : 148163

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.