ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ (AP Group 2 Prelims Exam):
ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ ఎగ్జామ్ జరగనుంది.. రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో గ్రూప్-2 రాత పరీక్షలు జరగనున్నాయని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు నిరంతర పర్యవేక్షణకు 24 మంది ఐఏఎస్ అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారులను నియమించామని సీఎస్ పేర్కొన్నారు. అదే విధంగా 24,142 మంది ఇన్విజిలేటర్లు, మరో 8500 ఇతర సిబ్బందిని ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమించామన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
అంతేగాక విస్తృత బందోబస్తు చర్యల్లో భాగంగా 3971 మంది పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు కాన్ఫిడెన్సియల్ మెటీరియల్ నిర్దేశిత ప్రాంతాలకు సురక్షితంగా తరలించేందుకు వీలుగా 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని నియమించామని తెలిపారు. అలాగే మొత్తం పరీక్షల తీరును ఏపీపీఎస్సీ నుంచి 51 మంది అధికారులు పర్యవేక్షించనున్నారని సీఎస్ పేర్కొన్నారు. ఇక ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా APPSC గ్రూప్ 2 అడ్మిట్ కార్డ్ మరియు చెల్లుబాటు అయ్యే ఫోటో ID ప్రూఫ్ యొక్క హార్డ్ కాపీని పరీక్ష హాల్‌కు తీసుకెళ్లాలని సూచించారు. Read Also..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.