ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారక పర్యటన:
ఈ రోజు ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారక పర్యటన సందర్భంగా సుదర్శన్ సేతు వంతెనను ప్రారంభించనున్నారు. దీంతో పాటు అనేక ప్రాజెక్టులను ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. ఈ క్రమంలో రాజ్‌కోట్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని 250 పడకల ఇండోర్ పేషెంట్ విభాగం కూడా ఈరోజు అధికారికంగా ప్రారంభించబడుతుంది.
మాజీ గవర్నర్ నివాసంలో సీబీఐ సోదాలు..!
ఆయుష్మాన్ భారత్, అభివృద్ధి చెందిన భారతదేశం’ లక్ష్యం కింద ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి ఐదు కొత్త ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని ప్రారంభించనున్న ఐదు కొత్త ఎయిమ్స్‌లో ఎయిమ్స్ రాజ్‌కోట్, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ భటిండా, ఎయిమ్స్ రాయ్ బరేలీ, ఎయిమ్స్ కళ్యాణి ఉన్నాయి.
డ్రగ్స్ పట్టివేత.. మార్కెట్ విలువ రూ.2,200 కోట్లు
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మొత్తం రూ. 11 వేల 391.79 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య ప్రాజెక్టులన్నీ దేశాన్ని ఆరోగ్య సంరక్షణలో ముందుకు తీసుకెళ్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ వైరల్
ఏపీలోని మంగళగిరిలో ప్రారంభం కానున్న ఎయిమ్స్ ఆసుపత్రిని రూ.1618 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో నిర్మించారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. అలాగే ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌లో భాగంగా రూ.230 కోట్ల విలువైన 9 క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు కూడా ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు.
10, 12వ తరగతులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు
వీటిలో ప్రధానంగా వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో రూ.23.75 కోట్ల చొప్పున, తెనాలి జిల్లా ఆస్పత్రిలో రూ.44.50 కోట్లు, హిందూపూర్ జిల్లా ఆస్పత్రిలో రూ.22.25 కోట్లతో చేపట్టనున్న క్రిటికల్ కేర్ బ్లాకుల్ని నిర్మించనున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.