బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ:
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్‌కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావడం లేదని ఆమె లేఖ ద్వారా సీబీఐకి తెలిపారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా నేడు విచారణకు హాజరుకావడం సాధ్యం కావడంలేదన్నారు. 2022లో తనకు సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారని, కానీ ఆ నోటీసులకు ఇప్పడు సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులకు చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు.
బండి సంజయ్ రెండో విడత ప్రజాహిత యాత్ర…
ఎలాంటి పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారన్న దానిపై స్పష్టత లేదని కవిత తెలిపారు. బీఆర్ఎస్ తరఫున తాను ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ రావడం వల్ల అవరోధం కలుగుతుందన్నారు. అందుకే, 41ఏ నోటీసులను రద్దయినా చేయండి, లేదా వెనక్కి అయినా తీసుకోండి అని కవిత విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సీబీఐ తన నుంచి ఏవైనా ప్రశ్నలకు సమాధానాలు కోరుకుంటే వర్చువల్ పద్దతిలో హాజరయ్యేందుకు తాను అందుబాటులో ఉంటానని కవిత స్పష్టం చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.