Health Tips:
చాలా మందికి భోజనం చేయగానే స్వీట్స్ తినాలని ఉంటుంది. భోజనం తర్వాత బెల్లం ముక్కని తింటే చాలా మంచిది. బెల్లం బీపీని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో యాసిడ్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. ఇందులోని పొటాషియం, సోడియం ఈ బెనిఫిట్స్‌ని అందిస్తాయి. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తహీనత దూరమవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. అలసట తగ్గుతుంది.
ఇది చదవండి: కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నారా..!
ఇందులోని చక్కెరగా మెల్లిగా శక్తిగా మారి ఇందుకు హెల్ప్ చేస్తుంది. ఇది మెల్లిగానే రక్తంలోకి చేరుతుంది. కాబట్టి, ఒకేసారి చక్కెరస్థాయిలు పెరగవు. జీర్ణక్రియని పెంచడంలో బెల్లంగా బాగా పనిచేస్తుంది. దీనిని తీసుకుంటే జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి. 10 గ్రాముల బెల్లంలో 16 మిల్లీ గ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఇది కడపు, పేగు ఆరోగ్యానికి చాలా మంచిది.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.