రేణిగుంట మండలానికి చెందిన ప్రజలకు 70% ఏర్పేడు మండలం చిందేపల్లి జగనన్న ఇంటి పట్టాలను కేటాయించారు. అయితే ఆ భూముల పైన అక్కడి రైతులు సరైన నష్టపరిహారం చెల్లించలేదని కోర్టుకు పోయారు. దీంతో అక్కడ ఇంటి పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇంటి స్థలాలు చూపించలేదు. దీంతో మొదటి నుండి రేణిగుంట మండలం వామపక్ష పార్టీ నాయకులు నిరసన తెలియజేస్తూ వచ్చారు. అయితే ఒక నెల క్రితం కరకంబాడి పంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 153 లోని 125 ఎకరాల ప్రభుత్వ భూములో నీ 44 ఎకరాల్లో ఎర్రగుట్ట పైన వామపక్ష నాయకులు ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి ఆక్రమించుకొని గుడారాలు నిర్మించుకున్నారు. అప్పటి నుంచి పలు దఫాలుగా రెవెన్యూ శాఖ, పోలీసులు ఆ స్థలాన్ని ఖాళీ చేపించేందుకు ప్రయత్నం చేసిన విఫలం చెందారు. కడకు వామపక్ష నాయకులతో రెవిన్యూ శాఖ చర్చలు జరిపిన వారు మాట వినకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు భారీ ఎత్తున పోలీసులు, రెవెన్యూ శాఖ, అగ్నిమాపక సిబ్బంది. ఆక్రమించుకున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి బలవంతంగా కాళీ చేయించారు. కాళీ చేపించే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. దీనిపై సిపిఎం నాయకులు వైసీపీ ప్రభుత్వం చేసిన పనిని ఖండిస్తూ, ఆ పార్టీ పై దుమ్మెత్తి పోశారు.
ఎర్రగుట్టను ఆక్రమించుకున్న పేదలు… ఖాళీ చేయించిన ప్రభుత్వ అధికారులు
118
previous post