102
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పామిడి మండలం అనుంపల్లి గ్రామానికి చెందిన శేషాద్రి అనే రైతు ల్యాండ్ ముటేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ల్యాండ్ ముటేషన్ చేయాలంటే 10000 లంచం ఇవ్వాలని ఆర్ఐ క్రాంతి కుమార్ రైతును డిమాండ్ చేశాడు. దీంతో రైతు 6000 రూపాయలు బేరం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఆర్ ఐ క్రాంతి కుమార్ రైతు నుండి 6000 రూపాయలు లంచం తీసుకుంటుండగా వలపన్నిన ఎసిబి అధికారులు. ఆర్ ఐ క్రాంతి కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అతని వద్ద ఉన్న 6 వేల రూపాయలను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి ఏసిపి కోర్టు లో హాజరు పరుస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.