ప్రకాశం జిల్లా పుల్లల చెరువు లో పంచాయతీ కార్యదర్శి మూడావత్ బాలునాయక్ ఎంపీడీఓ కార్యాలయం లో హరినాయక్ అనే వ్యక్తి నుండి పది వేలు లంచం తీసుకుంటుండగా ఎసీబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో హరినాయక్ తండ్రి ధర్మానాయక్ పుల్లల చెరువు పంచాయతీ పరిధిలో వీధి లైట్లు వర్క్ చేసారు. ఇటీవల ఆయన చనిపోయారు. ఈ నేపథ్యంలో వీధి లైట్లకు సంబంధించిన రెండు లక్షల బిల్లులను చెల్లించేందుకు పంచాయతీ కార్యదర్శి బాలునాయక్ హరినాయక్ ను ఇరవై వేలు లంచం డిమాండ్ చేయ్యగా ముందుగా హరినాయక్ ఐదు వేలు చెల్లించాడు. ఆ తరువాత పంచాయతీ కార్యదర్శి బాలునాయక్ కు లంచం ఇవ్వడం ఇష్టం లేని హరినాయక్ ఒంగోలు లోని ఎసీబి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పుల్లల చెరువు లోని ఎంపీడీఓ కార్యాలయం లో హరినాయక్ నుండి పది వేలు లంచం తీసుకుంటున్న పంచాయతీ అధికారి బాలునాయక్ ను ఎసీబి డిఎస్పీ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. దీంతో బాలునాయక్ పై కేసు నమోదు చేసిన ఎసీబి అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ACB officials
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పామిడి మండలం అనుంపల్లి గ్రామానికి చెందిన శేషాద్రి అనే రైతు ల్యాండ్ ముటేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ల్యాండ్ ముటేషన్ చేయాలంటే 10000 లంచం ఇవ్వాలని ఆర్ఐ క్రాంతి కుమార్ రైతును డిమాండ్ చేశాడు. దీంతో రైతు 6000 రూపాయలు బేరం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఆర్ ఐ క్రాంతి కుమార్ రైతు నుండి 6000 రూపాయలు లంచం తీసుకుంటుండగా వలపన్నిన ఎసిబి అధికారులు. ఆర్ ఐ క్రాంతి కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అతని వద్ద ఉన్న 6 వేల రూపాయలను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి ఏసిపి కోర్టు లో హాజరు పరుస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ రైటర్ రమణ కుమార్ ఓ కేసు విషయంలో ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పత్తికోళ్ల లంక గ్రామానికి చెందిన రామ్ కుమార్ అనే వ్యక్తిపై ఎక్సైజ్ కేసు నమోదు అయింది. ఈ కేసులో స్టేషన్బైల్ నిమిత్తం స్టేషన్ రైటర్ రమణ 8000 రూపాయలను లంచంగా డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించారు. ఇదే కేసులో బాధితుడి వద్ద నుండి 1000 రూపాయలను ఫోన్ పే ద్వారా డబ్బులు పొందిన నేపథ్యంలో ఏ ఎస్ ఐ వెంకటేశ్వరరావు పై కూడా కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Read Also..





Total views : 149986