ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లపై జోరుగా చర్చ సాగుతోంది. వారితో తమకు ముప్పే అని టీడీపీ, జనసేన సహా విపక్షాలన్నీ భయాందోళనకు గురవుతున్నాయి. వారంతా సర్కారు ఏజెంట్లు అని నమ్ముతున్నాయి. అందుకే వారిని ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలన్న డిమాండ్ వినిపిస్తున్నాయి. అంతేకాదు… కేంద్ర ఎన్నికల సంఘానికీ విజ్ఞప్తులు చేస్తున్నాయి. వారి భయానికి తగ్గట్లే సర్కారు చర్యలు ఉన్నాయి. కొందరు వైసీపీ ఎమ్మెల్యేల తీరు కూడా వివాదాస్పదంగా మారుతోంది. ఏటా వాలంటీర్లకు ప్రభుత్వం వారిని ప్రశంసిస్తూ బహుమానాలు అందజేస్తోంది. వారికి ఇచ్చే ప్రోత్సాహకాల బడ్జెట్ ను ఏకంగా డబులు చేసింది. దీనికి తోడు వైసీపీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు తాయిలాలు అందజేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అయితే స్వీట్ బాక్స్ పంపించారు. దాంట్లో 500 రూపాయాల నోటు కూడా అందజేశారు. అనంతపురం జిల్లాకు చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా ఇలాంటి బహేమానాలు పంపిణీ చేశారు. వ్యవహారం ఇలా సాగుతోంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అందుకే విపక్షాలు భయాందోళనకు గురవుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే వాలంటీర్లపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ వాలంటీర్లను ద్రోహులుగా అభివర్ణించారు. వీరిపై ఈసీ వద్ద పంచాయతీ పెట్టారు. టీడీపీ అయితే కోర్టులో కేసు కూడా వేసింది. వారికి జీతాలు కూడా ఇవ్వకూడదని ఆదేశాలు జారీచేయాలని కోరింది. వైసీపీ మాత్రం ఆరోపణలను కొట్టి పారేస్తోంది. విపక్షాల నేతల మాటలు ఆడలేక మద్దెల ఓడు అంటున్నట్లుగా ఉన్నాయని చెబుతోంది. అందుకే ఇంతకూ ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ల పాత్ర ఏంటి? అన్నది చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి