పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivas Reddy ) :
పేదవాడికి తోడునీడగా ఉండటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని విద్య వైద్యం మౌలిక సదుపాయాలు కల్పించటమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో నియోజకవర్గస్థాయి అభివృద్ధి పనులపై వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు మంత్రి పొంగులేటి స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులను నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఆర్ ఓ ఆర్ పట్టాలి పొందిన లబ్ధిదారులను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ఫారెస్ట్ అధికారులను ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు సరఫరా అవ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించి. ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా నాణ్యమైన విద్యను అందించాలని విద్యాశాఖ అధికారులను కోరారు.త్వరలో గ్రామసభలు ఏర్పాటు చేసి భూ సమస్యలను పరిష్కరించాలని, ధరణిలో అవినీతికి పాల్పడితే అధికారులను తక్షణమే రిమూవ్ చేస్తామని హెచ్చరించారు. చెరువు శిఖం భూములు కబ్జా చేస్తుంటే ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తామని ఒక్క రూపాయి కూడా ఉద్యోగాల కోసం ఖర్చు పెట్టవద్దని అవినీతికి పాల్పడే అధికారులను ఉపేక్షించేది లేదన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి : ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి