ఎన్ టి ఆర్ (NTR) జిల్లా విజయవాడ Vijayawada :
40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శక్తి , ఇంత కాలం అనుభవాలను తలచుకుంటూ ఇక ముందు ఎలా నడిపించాలో చర్చించుకునేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనం ను విజయవాడ ఫన్ టైమ్ క్లబ్ లో నిర్వహించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
గిరిజన సంస్కృతి సంప్రదాయాలను, వారి ఆట పాటలను, సామెతలను, వారి హక్కులను వారి పరంపరాగత జ్ఞానాన్ని, సహజ వనరులను పరిరక్షించి భావితరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో ఉద్భవించి, ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న శక్తి 40 వ వసంతంలోకి అడుగిడుతున్న తరుణంలో జరుపుకుంటున్న వార్షికోత్సవ వేడుక
శక్తి శివరామ కృష్ణ(Shakti Sivarama Krishna) కామెంట్స్…
చాలా మంది గిరిజన ప్రాంతాల్లో సాయుధ పోరాటం, సిద్ధాంత పోరాటాలు చేస్తున్న సమయంలో నా వంతు కృషిగా గిరిజనులకు పరిజ్ఞానం పెంపొందించదలిచాను. కొంతమంది ఐపీఎస్ అధికారులు నాకు పరిచయం అవ్వటం ,వాళ్ళ దగ్గర నుండి కొంత సమాచారం తెలుసుకుని ప్రజలకు చేరువేశాను. గిరిజనులను హించంచడం, వేధించడం న్యాయం కాదని అధికారులకు చెప్పడం జరిగింది. మొదటి సారి భారత దేశంలో లాండ్ రికార్డ్ లో ప్రజల దగ్గరకు కలెక్టర్ వెళ్లి చదివి వినిపించేవారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి శ్రీకాకుళం కలెక్టర్ గా ఉన్నప్పుడు ప్రజలకు లాండ్ సర్వే నేర్పించడానికి సెర్ప్ (వెలుగు) నన్ను ప్రతినిధిగా పంపించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి