ఆక్రమణదారుల నుంచి భూముల పరిరక్షణ, భూరికార్డులను మరింత పకడ్బందీగా నిర్వహించడమే లక్ష్యంగా హెచ్ఎండీఏ(hmda) అడుగులు వేస్తోంది. సీఎం రేవంత్రెడ్డి(hmda) ఆదేశాలు ఇవ్వడంతో భూములు ఆక్రమణలకు గురికాకుండా అధికారులు పటిష్ఠమైన ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నారు. జీపీఎస్ మ్యాపింగ్, జియోట్యాగ్ లాంటి సాంకేతిక విధానాల ద్వారా హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని ఖాళీ స్థలాలపై పర్యవేక్షణ ఉండాలని అధికారులు యోచిస్తున్నారు. జీపీఎస్, జియోట్యాగ్లతో ఎప్పటికప్పుడు ఆయా భూములకు సంబంధించిన ఆక్రమణలు ఆఫీస్ నుంచే ఆన్లైన్లో గమనించే వీలు కలుగుతుంది.
ఇది చదవండి: రౌడీ షీటర్ బర్త్ డే వేడుకలకు అడ్డాగా పోలీస్ ఠాణా..
ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఏడు జిల్లాల పరిధిలోని భూముల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 10 వేల ఎకరాల భూమిని గుర్తించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి, భువనగిరి, సిద్ధిపేట జిల్లాల్లో హెచ్ఎండీఏకు విలువైన భూములు ఉన్నాయని తేలింది. కాగా కొన్నేళ్లుగా భూముల ఆక్రమణ ఎక్కువైపోయింది. అధికారులకు సమాచారం అంది స్పందించి చర్యలు తీసుకునేలోపే ఆక్రమణదారులను కోర్టుల నుంచి స్టేలు తీసుకొచ్చి ఆటంకాలు సృష్టిస్తున్నారు. దీంతో అధునాతన సాంకేతిక విధానాల ద్వారా ఎప్పటికప్పుడు భూఆక్రమణలను గర్తించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.