పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) :
కులవృత్తులకు అధునాతన సాంకేతికతను జోడించి బీసీ కులాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ సిఖ్ విలేజ్ మడ్ ఫోర్డ్ దోభి ఘాట్ లో మోడ్రన్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ ను రవాణా, బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దోబీ ఘాట్ లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మారాలని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎంపి తో పాటు ప్రభుత్వ నిధులతో మోడ్రన్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ లను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కులవృత్తులను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలను కల్పించి అధునాతన సాంకేతిక విధానాలతో ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. బీసీ జనగణన విషయంలో కూడా అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. బీసీలంతా ఐక్యత ఉండి వారి హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి