చంద్రబాబు(Chandrababu) నివాసంకు పవన్ కల్యాణ్(Pawan Kalyan):
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. రెండో జాబితాలో అభ్యర్థుల ఎంపికపై వీరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది. తొలి జాబితాలో టీడీపీ 94 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన అధినేత పవన్ ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అయితే, రెండో జాబితాలో అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు ఇరువురు నేతలు భేటీ అయినట్లు సమాచారం.
టీడీపీ , జనసేన అభ్యర్థుల రెండో జాబితాను ఎన్నికల నోటిఫికేషన్..
టీడీపీ , జనసేన అభ్యర్థుల రెండో జాబితా(second list)ను ఎన్నికల నోటిఫికేషన్(Election notification) వెలువడిన తరువాత ప్రకటించాలని ఇరు పార్టీల అధినేతలు తొలుత భావించారు. అయితే, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రెండో జాబితాలో కొన్ని సీట్లను ప్రకటించేందుకు ఇరువురు నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండో జాబితాలో టీడీపీ తరపున కొన్ని సీట్లు, జనసేన తరపున కొన్ని సీట్లు ప్రకటించాలని నిర్ణయించారు. ప్రస్తుత భేటీలో ఏఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాలి అనే విషయంపై వీరి మధ్యచర్చ జరుగుతునున్నట్లు తెలుస్తోంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ముదురుతున్న పాలేరు జలవివాదం…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి