అధిక వర్షాలు, తుఫాన్ లతో తొలకరి పంట తుడిచిపెట్టుకు పోతుంటే… సమయానికి సాగు నీరందక దాల్వ పంట చేలు బీడు భారడం, వేసిన పంట పొట్ట దశకు రాకుండా నే ఎండి పోతుండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. సాగు నీరు సక్రమంగా సరఫరాకు దోహదం చేసే పంట కాల్వలు, బోదెలు ఆధునికీకరణకు నోచుకోక పోవడం ముంపు నీరు దిగేందుకు దోహదం చేసే మేజర్, మైనర్ డ్రయిన్స్ లలో పేరుకు పోయిన పూడిక తీసేవారు లేకపోవడం అతివృష్టి, అనావృష్టి సమయాల్లో రైతులుకు శాపంగా మారుతోంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రస్తుతం సాగునీటి ఎద్ధడితో రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నియోజకవర్గ పరిధిలోని ఐ పోలవరం మండలం, కాట్రేనికోన మండలం, ముమ్మిడివరం మండలాల్లో శివారు ప్రాంతాలకు, ఎత్తెన ప్రాంతాలకు సాగు నీరు అందకపోవడం, మోటార్ల ద్వారా సాగునీరు మల్లించుకుందామంటే అసలు పంట కాల్వల్లోనే సాగు నీరు అడుగంటడం రైతులుకు శాపంగా మారింది.
ఐ పోలవరం మండలం పాత ఇంజరం గ్రామంలో ఐతే పూర్తి గా ఆరిపోయి ఉన్న వరి పొలంలో రైతులు కూర్చుని సాగునీరు ఇచ్చి రైతులును ఆదుకోవాలని నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. ఎకరాకు ముప్తె వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు ఆ పెట్టుబడులు సైతం దక్కే దారి లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దిక్కుతోచకుండా ఉందని రైతులు వాపోతున్నారు. వరుస పంట నష్టాలతో అప్పులు పాలై, పెట్టు బడులు రాక, కౌలు శిస్తులు చెల్లుంచుకోలేక నలిగి పోతున్నామని రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి