మహిళల కోసం కొత్తగా ‘కలలకు రెక్కలు’ పథకం..
తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) మహిళల అభ్యున్నతి కోసం కొత్తగా ‘కలలకు రెక్కలు’ పథకం తీసుకువచ్చింది. టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, చదవుకోవాలనుకునే అమ్మాయిలకు ఆర్థికపరిస్థితులు అడ్డంకిగా మారరాదని అన్నారు. అలాంటి వారు ఇంటికే పరిమితం కాకుండా, వారికి బ్యాంక్ లోన్లు ఇప్పించే కార్యక్రమమే కలలకు రెక్కలు(Kalalaku Rekkalu) పథకం అని వివరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న అమ్మాయిలు ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటే, వారికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని, ఆ రుణాలకు ప్రభుత్వమే ష్యూరిటీ ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ఆ రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరించేలా కలలకు రెక్కలు(Kalalaku Rekkalu) పథకానికి రూపకల్పన చేశామని చెప్పారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే ఆడపిల్లలు కలలకు రెక్కలు(Kalalaku Rekkalu) పథకం వెబ్ సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.
ఇది చదవండి: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముదునూరి…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి