కూకట్ పల్లి లోని మలేషియన్ టౌన్షిప్ లో వరల్డ్ కిడ్నీ డే (World Kidney Day) ను అపోలో డయాలసిస్ (Apollo Dialysis)వారు నిర్వహించారు. మానవునికి కిడ్నీ అనేది ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ రావు పేర్కొన్నారు. అనవసరంగా మందులను వాడడం వల్ల కిడ్నీ ఎక్కువ చెడిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రతిరోజు మానవుడు కనీసం 45 నిమిషాలు ఆరోగ్యం కోసం కేటాయించాలన్నారు, వ్యాయామ, ఆటలు మొదలగునవి చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కిడ్నీ పరీక్షలు ప్రతి మూడు నుండి నాలుగు నెలలకు ఒకసారి చేసుకోవాలన్నారు. కిడ్నీ 70 శాతం వరకు పాడైపోయిన కానీ ఎలాంటి లక్షణాలు కనిపించవని అన్నారు. వరల్డ్ కిడ్నీ డే ను పురస్కరించుకొని అందరికీ అపోలో డయాలసిస్ వారు ఫ్రీ కిడ్నీ టెస్ట్లు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: చెలరేగిపోతున్న కిడ్నాపర్లు.. పిల్లలు జాగ్రత్త..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి