రోడ్డెక్కిన టీడీపీ వర్గపోరు…
మాజీ ఎమ్మెల్యే వర్సెస్ పార్టీ ఇన్చార్జ్…
ఒకరిపై ఒకరు ఆరోపణలు…
పట్టించుకోని అధిష్టానం…
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. రెండు వర్గాల అనుచరులు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణలు పార్టీని రోడ్డున పడేటట్లు చేస్తున్నాయి. మాజీ ఎమ్మల్యే బండారు మాధవ నాయుడు, పార్టీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు వర్గాలు మధ్య మాటలు తూటాలుగా మారుతున్నాయి. ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదిరి పాకాన పట్టింది.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
అయిదేళ్ల క్రితం కలిసి కట్టుగా ఉన్న తెలుగు తమ్ముళ్లు ఈ అయిదేళ్లలో రెండు వర్గాలుగా విడిపోవడం పార్టీకి తల నొప్పిగా మారింది. 2019 ఎన్నికలలో పరాజయం పొందిన బండారు మాధవనాయుడు పార్టీ కార్య క్రమాలకు దూరంగా ఉండటం తో పార్టీ సీనియర్ నాయకుడు పొత్తూరి రామరాజు ను ఇంఛార్జి గా అదిష్టానం నియమించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మాధవనాయుడు, రామరాజుల మధ్య దూరం పెరిగింది. రెండు వర్గాలుగా విడిపోయారు. అప్పటి నుంచి రెండు వర్గాల వారు పార్టీ కార్య క్రమాలను వేరు వేరుగా చేపట్టడం పార్టీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇది చదవండి : కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఘోర నిర్లక్ష్యం…
పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం కార్యక్రమంలో కూడా రెండు వర్గాల వారు బల ప్రదర్శనకు దిగడం, పోటా పోటీగా ఫ్లెక్సీలు, ర్యాలీలు పెట్టడంతో రెండు వర్గాల మధ్య వార్ చాప కింద నీరులా మారింది. పార్టీ లో నెలకొన్న ఆధిపత్య పోరును పెద్దల పరిష్కరించకపోవడంతో ఇరువర్గాల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. ఎన్నికల వేళ…. ఈ గోల యేల అంటూ మూడు పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. అధికార పార్టీని గద్దె దింపడానికి ఒక్కటైన తెలుగుదేశం, జనసేన, బిజేపి పార్టీలకు నర్సాపురం నియోజకవర్గం లోని టిడిపి వర్గపోరు ఈ ఎన్నికలకు ఎటు దారి తీస్తుందో అని పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి