ఢిల్లీ మద్యం కేసు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన కేసులను విచారిస్తున్న రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియమితులయ్యారు. తీస్ హజారీ కోర్టు జిల్లా న్యాయమూర్తిగా నాగ్‌పాల్….బాధ్యతలు చేపట్టనున్నారు. జడ్జి నాగ్‌పాల్ మద్యం పాలసీ కేసును ప్రారంభం నుంచి విచారిస్తున్నారు. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తదితర ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. సిసోడియా, సంజయ్ సింగ్ జ్యూడిషియల్ రిమాండ్ లో ఉండగా, కవిత ఈడీ రిమాండ్‌లో ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బదిలీ పోస్టింగ్ జాబితా ప్రకారం… ఢిల్లీ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు చెందిన మొత్తం 27 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఇందులో న్యాయమూర్తి నాగ్‌పాల్ ఒకరు. మరోవైపు, ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు చెందిన 31 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు.
ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం…
130